పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఆయన నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ K సినిమా కూడా ఒకటి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ఆడియన్స్ సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అయిన దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో అమితాబచ్చన్ సైతం ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

అంతేకాదు ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన పలు రకాల అప్డేట్లను ఇచ్చారు చిత్ర బంధం. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో లోక నాయకుడు కమలహాసన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లుగా ఇప్పుడు వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటివరకు ఊహించిన విధంగా ఉండబోతుంది అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా మొత్తంలో కమల్ హాసన్ పాత్ర చాలా హైలైట్ గా ఉండబోతుందని సమాచారం.

అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు కమలహాసన్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాగా ఈ సినిమాలో కమలహాసన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అందుకే ఈ సినిమాలో విలన్ పాత్ర చేయడానికి కమల్ హాసన్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు మరింత క్రేజ్ ఏర్పడింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: