తెలుగులో ప్రస్తుతం స్టార్ యాంకర్ అంటే కచ్చితంగా యాంకర్ సుమ నే అని చెబుతూ ఉంటారు. ఒకవైపు టీవీ షోలో మరొకవైపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటోంది యాంకర్ సుమ.. కొన్ని చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.. ముఖ్యంగా సుమ ఏదైనా ఈవెంట్ చేసిందంటే కచ్చితంగా సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుందని అందరిలోని ఫీలింగ్ అని చెప్పవచ్చు. సుమ యాంకర్ గా వస్తే ఆమె చలాకితనంతో పాటు ఈ ఈవెంట్ కు కూడా మరింత ఎనర్జీ లభిస్తుందని అభిమానులు సైతం నమ్ముతూ ఉంటారు.

టాలీవుడ్ స్టార్స్ కు కూడా సుమ యాంకరింగ్ కంటే చాలానే ఇష్టపడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే సుమ యాంకర్ గా మారిన తర్వాత ఒక కొత్త చరిత్రను సృష్టించింది. ఈమె ఇమేజ్ను ఇంకెవరు కూడా అందుకోలేరని చెప్పవచ్చు. సుమ తర్వాత అంత రేంజ్ ఉన్న యాంకర్ ఎవరంటే శ్రీముఖి ,ప్రదీప్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ పలు టీవీ రియాలిటీ షోలకు మాత్రమే పరిమితమయ్యారు.. శ్రీముఖి అయితే సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సుమ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


అదేమిటంటే సుమ టీవీ షోలని చాలా వరకు తగ్గించిందని ఆమె వద్దనుకోవడంతో గతంలో హ్యాండిల్ చేయలేక పలు గేమ్ షోలను కూడా పూర్తిగా బంద్ చేయించేలా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. కేవలం సుమ చేతిలో ఒక్క టీవీ షో మాత్రమే ఉంది. అది కూడా సుమ రెమ్యూనికేషన్ భారీగా పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ కారణంగానే ఈమె చేసి టీవీ షోలు కూడా ఆపేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలకి మంజు భార్గవి తో పాటు మరికొంతమంది యాంకర్స్ పోటీపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే సుమా హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: