పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరో గారు పొందిన మైథాలజికల్ డ్రామా ఆదిపురుష్ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు చిత్ర బృందం. ఇక ప్రభాస్ హిందీలో నటించిన మొదటి స్ట్రైట్ సినిమా ఇదే. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కృతి సనన్ నటించింది . ఈ సినిమా కోసం చిత్ర బృందం అమ్మోరు ఫార్ములానే వాడుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. 

అదేంటంటే ఈ సినిమా థియేటర్లలోనే టికెట్లన్నీ అమ్మినా కూడా ఒక టికెట్ని మాత్రం అమ్మకుండా వదిలేస్తారట. ఇక ఆ ఒక్క టికెట్ హనుమంతుడి కోసం అమ్మకుండా వదిలేస్తాడట. అయితే రామాయణ పారాయణం ఎక్కడ జరిగిన అక్కడికి హనుమంతుడు వస్తాడు అన్నది అందరి నమ్మకం. అందుకే ఆ ఒక్క సీటు హనుమంతుడి కోసం పని చేస్తారట. ఇక ఈ విషయం సినిమా పబ్లిసిటీకి మరింత ఉపయోగపడుతుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే దానికి ఒక కారణం కూడా ఉంది థియేటర్ అంతా నిండిన కూడా అందరూ ఆ ఒక్క సీటు ఖాళీగా ఉంటే ఆ ఒక్క సీటునే చూస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే అక్కడికి హనుమంతుడి ప్రతిమ వంచితే గనక ప్రేక్షకులు అందరూ

 కూడా సినిమా చూస్తూ భక్తి మూలలోకి వెళ్ళిపోతారు. అయితే గతంలో అమ్మోరు సినిమా సమయంలో కూడా ఇలాంటి ఫార్ములానే యూస్ చేశారో. అయితే అది చిత్రం యాజమాన్యాలు మరియు ప్రేక్షకులు కలిసి ఆ పనిని చేశారు. సినిమా ప్రదర్శింపబడుతున్న సమయంలో హారతులు పట్టడం థియేటర్ బయట ఒక చిన్న గుడి పెట్టడం వంటివి అప్పటిలో చేశారు .అంతే కాదు అక్కడ పూజలు హుండీలు ప్రసాదాలు వంటివి కూడా ఆ సమయంలో ఏర్పాటు చేశారు. అందుకుగాను ఆ సినిమా విడుదలై మంచి హిట్ అయ్యింది. అయితే ఇలాంటివి చేయడం వల్ల ఆ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగాయి. దీంతో అదే ఫార్ములా అని ఇప్పుడు ఆది పురుష్ సినిమా కోసం కూడా వాడుతున్నారు అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: