
అయితే కోట్లు ఖర్చుపెట్టి ఈవెంట్ నిర్వహించిన గ్రాండ్ గా సెట్ వేసిన ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా కొన్ని తప్పులు అయితే జరిగిపోయాయి . అభిమానుల కోసం ఎంతో ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ను పొరపాటున టెలికాస్ట్ చేసేసారటా టెక్నికల్ టీం. దీనితో ఆది పురుష్ టీం మొత్తం కూడా ఎంతో డిసప్పాయింట్ అయిపోయింది. అంతేకాదు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం కూడా ఇంట్రడ్యూసింగ్ లతోనే కాలం గడిచిపోయిందని.. సినిమాకి సంబంధించిన విషయాలను ఎక్కడ కూడా షేర్ చేయలేదని ఫ్యాన్స్ తెగ మండిపడిపోతున్నారు . ప్రభాస్ కోసం వేలు ఖర్చు పెట్టి మరీ పాస్ లు తీస్తే ఆయన పట్టుమంటే ఓ గంట కూడా స్టేజీ పైన లేడని..సరిగ్గా మాట్లాడలేదని ..అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారని కూడా వార్తలు వినపడుతున్నాయి . అంతేకాదు మొదటి నుంచి ప్రభాస్ ని ప్రదీప్ మూడు ప్రశ్నలు వేయాలి వేయాలి అంటూ చెప్పుతూనే ఉన్నారు. అయితే చివర్లో ప్రభాస్ ప్రదీప్ మాటలు వినకుండా నే జై శ్రీరామ్ అంటూ స్పీచ్ ని ముగించి వెళ్ళిపోవడం అభిమానులకు నిరాశ ను కలిగించింది దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు వైరల్ గా మారింది..అలాగే ప్రదీప్ ఫ్యాన్స్ కూడా తన అభిమాని ని మాట్లాడనివ్వలేదంటూ ఆయన పై ఫైర్ అవుతున్నారు.