తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమా లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఎన్టీఆర్ ... రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఒక్క సారిగా ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగి పోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. అలాగే ఈ రెండు మూవీ ల తర్వాత బాలీవుడ్ మూవీ అయినటువంటి వార్ 2 లో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తనకు నచ్చిన సినిమాలు ఏవి అని అడిగిన సందర్భాలలో ఎక్కువ శాతం తన తాత అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను ... తన బాబాయ్ అయినటువంటి బాలకృష్ణ సినిమాలను ఎక్కువగా చెబుతూ వస్తాడు.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి ఒక సినిమా అంటే జూనియర్ ఎన్టీఆర్ కు చాలా ఇష్టమంట. ఆ సినిమా ఏది అనుకుంటున్నారా ... అదే రుద్రవీణ. ఒక గొప్ప స్టార్ హీరో అయ్యి ఉండి కూడా రుద్రవీణ లాంటి వైవిధ్యమైన సినిమాలో నటించడం అనేది చాలా గొప్ప విషయం అని ... అలాగే ఆ సినిమా కూడా అద్భుతంగా ఉండడంతో రుద్రవీణ అనే సినిమా అనే జూనియర్ ఎన్టీఆర్ కు చాలా ఇష్టమట.

మరింత సమాచారం తెలుసుకోండి: