ఒక డైరెక్టర్ స్టార్ హీరోతో సినిమా చేసి ఆ సినిమా సక్సెస్ అయితే కనుక తనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఆ సినిమా కనుక డిజాస్టర్ అయితే హీరోకి తదుపరి సినిమా అవకాశాలు వచ్చిన డైరెక్టర్ కు మాత్రం అవకాశాలు రావడం చాలా కష్టం.బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న  ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో సాహో  సినిమాను చేసాడు.. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది.

సినిమా తర్వాత ప్రభాస్ రాదే శ్యామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయిందని చెప్పాలి.ఈ రెండు సినిమాలలో నటించిన ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉండగా ఈ దర్శకులకు మాత్రం సినిమా అవకాశాలు అయితే రాలేదు. సాహో విడుదలైన కొన్ని సంవత్సరాల తర్వాత సుజిత్ కి పవన్ కళ్యాణ్  తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈయన ఈ సినిమా షూటింగ్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఇకపోతే రాదే శ్యామ్ గత ఏడాది విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాధాకృష్ణకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు అయితే తాజాగా ఈయనతో సినిమా చేయడానికి ఒక హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.ఇటీవల ఒక స్టోరీతో రాధాకృష్ణ కోలీవుడ్ హీరో విశాల్ కి స్టోరీ లైన్ వినిపించారని తెలుస్తుంది..అయితే ఈ స్టోరీ లైన్ నచ్చినటువంటి ఈయన డైరెక్టర్ రాధాకృష్ణతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: