
అయితే సమంత తరహాలోనే రాజు అండ్ డీకేతో కలిసి రాశి ఖన్నా ప్రయోగాత్మకంగా వెబ్ సిరీస్ లో నటించింది. దీనికి కూడా మంచి పేరు లభించింది. ఆ తర్వాత సీనియర్ నాయక రాధిక పండిట్.. మరొక హీరోయిన్ కియారా అద్వానీ కూడా వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించారు. ఇప్పుడు వీరి బాటలోనే తమన్నా, కాజల్, కీర్తి సురేష్, లావణ్య త్రిపాఠి కూడా ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు.. ఇలా అందాల హీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్లలో సత్తా చాటుతో ఇప్పుడు అదే బాటలో ఇలియానా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఇలియానా గర్భవతిగా ఉన్నది వాస్తవానికి ముందు గానే క్రేజీ వెబ్ సిరీస్ లో ఎంట్రీ ఇచ్చిందని వార్తలు వినిపించాయి. 2023 చివరిలో ఈ సిరీస్ స్ట్రిమ్మింగ్ తీసుకురావాలని లక్ష్యంతో నిర్మాత ఆషి దువ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ నాయక ప్రధాన పాత్రలో ఇలియానాకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది.ఇలియానా పాత్ర గురించి మాట్లాడుతూ ఇలియానా బర్ఫీ సినిమాలోని పాత్ర చూసి ఆమెను ఎంచుకున్నట్లుగా తెలియజేశారు. ఈ సిరీస్ కి కరిష్మా కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.