టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక దీరుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటు వంటి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ కు మాత్రమే పరిమితమైనటువంటి ఈయన పేరు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది.ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏ స్థాయి లో ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కు ఆస్కార్ అవార్డు రావడం తో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తం గా వినపడుతుంది. ఎంతోమంది హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రాజమౌళి పని తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైతే స్టార్ సెలబ్రిటీ హోదా ఉండి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అలాంటి వారికి పలు కంపెనీ లు తమ ఉత్పత్తు లను ప్రమోట్ చేయాలి అంటూ ఎన్నో కంపెనీలు భారీగా ఆఫర్ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు ఇలాంటి కమర్షియల్ యాడ్స్ లో దర్శకులు పెద్దగా నటించలేదని చెప్పాలి కానీ మొదటిసారి రాజమౌళి కి ఇలాంటి అవకాశం రావడం తో ఈయన కూడా కమర్షియల్ యాడ్ చేయడాని కి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా జరిగాయని, ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇందులో రాజమౌళి సూట్ వేసి అదరగొట్టేశాడు. స్టైల్ గా ఫోన్ తిప్పుతూ నడుస్తూ హంగామా చేశారు. ఐతే ఇది ఒప్పో కంపెనీ ఫోన్ కోసం యాడ్ చిత్రీకరిస్తున్నట్టు, ఇందులో రాజమౌళి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మొదటిసారి ఒప్పో మొబైల్ ఫోన్ కి రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడం తో హీరోలకు రాజమౌళి ఏ మాత్రం తీసిపోరు అంటూ కొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: