ప్రస్తుతం అమీషా పటేల్ సన్నీ డియోల్ కి జోడిగా గద్దర్-2 సినిమాల నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇదంతా ఇలా ఉంటే అమీషా పటేల్ ఎంత స్టార్ ఇమేజ్ అందుకున్న కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. అక్షయ్ కుమార్ సింగ్ అనే నిర్మాత గతంలో రాంచికోర్టులో ఈమె పైన కేసు వేయడం జరిగింది.. తనకి ఒక సినిమా చేస్తానని అమీషా పటేల్ రూ.2.5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుందని కానీ ఆ సినిమాలో నటించలేదని పిటిషన్లు తెలియజేసినట్లు సమాచారం. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే చల్లని చెక్కు ఇచ్చి తనని మోసం చేసిందని ఫిర్యాదుల తెలియజేయడం జరిగింది.
వారి నుంచి తప్పించుకోవడానికి కోసం ముఖానికి ముసుగు వేసుకొని స్పీడ్ గా నడుచుకుంటూ కారులో రావడం జరిగింది. అయినా కూడా మీడియా వాళ్ళు మాత్రం ఫోటోలు తీయడం మానలేదు. మొత్తానికి అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో కోర్టులో లొంగిపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది రూ.2.5 కోట్ల రూపాయలతో పాటు అదనంగా 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆ నిర్మాత డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. మరి దీనిపై రాంచికోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి