అఖిల్ తో ఆమె తన మొదటి సినిమాగా చేసిన ‘ఏజెంట్’ ఫ్లాప్ అయినప్పటికీ సాక్షి వైద్యకు వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె వరుణ్ తేజ్ తో ‘గాండీవధారి అర్జున’ మూవీలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ తో త్వరలో ప్రారంభం కాబోయే ‘గంజా శంకర్ మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇది చాలదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయింది.
ఈసినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో కూడ ఈమె హీరోయిన్ గా ఎంపిక అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలకు హీరోయిన్స్ సమస్య చాల ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే సెటిల్ అయిన చాలామంది టాప్ హీరోయిన్స్ మీడియం రేంజ్ హీరోలతో నటించడానికి భారీ పారితోషికాలు అడుగుతున్నారు. దీనికితోడు పూజా హెగ్డే రష్మికల క్రేజ్ కూడా యూత్ లో ఒక్కసారిగా తగ్గిపోయింది. వీరు నటించిన సినిమాలు కూడ ఫ్లాప్ అవుతున్న పరిస్థితులలో యంగ్ హీరోయిన్స్ కు డిమాండ్ పెరిగింది.
క్రేజ్ ఉన్నశ్రీలీల డేట్లు కావాలంటే కనీసం ఆరేడు నెలలు వెయిట్ చేయాల్సి ఉన్న పరిస్థితి. దీనితో ఫ్లాప్ వచ్చినా సాక్షి వైద్య కు దర్శకులు నిర్మాతలు పట్టించుకోకుండా ఏదో ఒక హిట్ వస్తుంది కదా అన్న ఆశతో ఆమెకు వరసపెట్టి అవకాశాలు ఇస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో రానున్న రోజులలో ఈమె అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి