కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ప్రస్తుతం దర్శకురాలిగా మారి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఈమె తాజాగా దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రం లాల్ సలాం.లైకా నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇందులో రజినీకాంత్ ముస్లిం వ్యక్తి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.ఇక రజనీకాంత్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని ఈ పాత్ర ద్వారా సినిమా మొత్తం మలుపు తిరుగుతుందని తెలుస్తుంది.

ఇలా రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నటువంటి లాల్ సలాం సినిమా ద్వారా సీనియర్ నటి నిరోష తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఇక ఈ సినిమా ద్వారా ఈమె ఎవరో సారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే నిరోషా ఈ సినిమాలో రజనీకాంత్ కు చెల్లెలి పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈయనకు చెల్లెలుగా నటిస్తున్నారా లేక తనకు జోడిగా నటిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈమె ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో హీరోయిన్గా నటించి ఓ వెలుగు వెలిగారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నిరోషా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా చాలా కాలం తర్వాత ఈమె ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె స్వయానా రాదికకు సోదరి అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాలు సమకూర్చుగా ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తికా వచ్చింది. త్వరలోనే నిరోషా రజినీకాంత్ మధ్య జరిగే సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: