మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ నటుడు రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటగా రవితేజ ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ఈ నటుడు ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

ఇకపోతే కొంత కాలం క్రితమే రవితేజ "రావణాసుర" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ఈ నటుడు హీరోగా నటించాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... రావణాసుర మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి జీ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మరి కొన్ని రోజుల్లో ఈ సినిమాను జీ సంస్థ వారు జీ తెలుగు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే  రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ... ఈగల్ అనే సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు మూవీ ల షూటింగ్ లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ రెండు మూవీ లపై కూడా తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: