కళ్ళలోనే భయం అన్న పేరుతో విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా సాగుతోందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా చూస్తుంటే మనకు క్రైమ్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్ తో రూపొందినట్లు కచ్చితంగా ఈ సినిమా మరో నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది అని.. తప్పనిసరిగా ఈ సినిమాతో పాయల్ ఒక సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే బటర్ఫ్లై పొలాల మధ్యలో గుండ్రంగా ఎగరడంతో టీజర్ మొదలవుతుంది.
తర్వాత ఒక అమ్మవారి గుడిని చూపించడం అందరూ ఏం జరగబోతుందో అని ఆసక్తికరంగా భయంతో పైకే చూస్తూ ఉన్నట్లుగా మనకు ఆ టీజర్ లో కనిపించారు. అందులో ఉండే నటీనటుల కళ్లనే హైలెట్ చేస్తూ వారందరూ భయంతో ఏదో పైకి చూస్తున్నట్లుగా డైరెక్టర్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అంతేకాదు మధ్య మధ్యలో పాయల్ కు సంబంధించిన ఎమోషనల్ , బోల్డ్ అండ్ సీరియస్ షాట్ కూడా చూపించడం జరిగింది. ఆమె ఏడుస్తూ కోపంతో అరుస్తున్నట్టుగా కూడా చూపించారు అయితే ఆమె పాత్ర ఏమిటి అన్నది మాత్రం మనకు ఇంకా రివీల్ చేయలేదు. కాంతారా ఫేమ్ బి అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఇకపోతే కథ ఏమిటి అన్నది రివీల్ చేయలేదు కానీ ఇది ఒక విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తరహాలో ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో లక్ష్మణ్, అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ మరికొంతమంది కీలకపాత్రను పోషిస్తున్నారు.ఇక ఈ సినిమా తో అయిన డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి