భోళా శంకర్ సినిమా రివ్యూలు ఎలా ఉన్నా సినిమా మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందడం గ్యారంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య కు సైతం రిలీజ్ రోజున నెగిటివ్ రివ్యూలు రాగా ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ కు ఊహించని స్థాయిలో లాభాలను అందించింది. నైజాంలో మైత్రీ నిర్మాతలు సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసుకోవడంతో వాళ్లకు భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి.
అయితే భోళా శంకర్ మూవీ సెట్స్ లో చిరంజీవి కీర్తి సురేష్ పీక పట్టుకోవడం గతంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే కీర్తి పీక పట్టుకోవడం గురించి మెగాస్టార్ స్పందిస్తూ మా ఇంట్లో తమిళ వంట మనిషి ఉన్నాడని కీర్తికి కావాల్సిన భోజనం అతనే పంపేవాడని చెప్పారు. ప్రతిరోజూ కీర్తి చాలా వెరైటీలు తినేదని తినే మొత్తం తక్కువే అయినా ఎంజాయ్ చేసేదని ఒక్కోసారి ఏం కావాలో డిమాండ్ చేసేదని చిరు తెలిపారు.ఉప్పు, కారం తగ్గితే ఫుడ్ ను కీర్తి సురేష్ వెనక్కు పంపేదని మళ్లీ సరిగ్గా చేయమని కోరేదని చిరంజీవి పేర్కొన్నారు. ఒకసారి షూట్ లో బిజీగా నన్ను కీర్తి సురేష్ రేపు మెనూ ఏంటి అని అడిగిందని నాకు ఒక్కసారిగా కోపమొచ్చి పీక పట్టుకున్నానని ఈ షాట్ ఆ సమయంలో తీసిన షాట్ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి