మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి టైగర్ ఇన్విషన్ అనే పేరుతో ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ అద్భుతమైన రీతిలో ఉండడంతో దీనికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 5.61 మిలియన్ వ్యూస్ ను ... 137 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో రవితేజ ఓ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ మూవీ లో భారీ యాక్షన్స్ సీన్స్ ... అలాగే భారీ గ్రాఫిక్స్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే రవితేజ కు దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: