క్రికెట్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు అటు చిత్ర పరిశ్రమలో ఉండే క్రేజే వేరు. ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా సినిమాలకు తరలి వెళ్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా క్రికెట్ నేపద్యంలో వచ్చిన సినిమాలు కొన్ని ప్రేక్షకులను నిరాశపరిస్తే.. మరికొన్ని మాత్రం చిన్న సినిమాలుగా వచ్చి సూపర్ హిట్ సాధించాయి. అయితే కొన్ని సాధారణ క్రికెట్ డ్రామాగా వస్తే.. ఇంకోన్ని మాత్రం ఏకంగా క్రికెటర్ల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీస్ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో మరో సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.


 గ్లామర్ అనే మూవీ రూపొందింది. అభిషేక్ బచ్చన్, సయామీకేర్ కలిసి నటించిన ఈ సినిమా ఒక స్పిన్ బౌలర్ చుట్టూ తిరుగుతుంది. కుడి చేయి కోల్పోయిన ఒక అమ్మాయి.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా ఎలా ఎదిగింది అనేది మూవీలో చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు ఆర్ బాల్కే దర్శకత్వం వహించారు. చేయి లేని క్రికెటర్ పాత్రలో సయామీకేర్ కనిపించగా.. ఆమె కోచ్గా అభిషేక్ బచ్చన్ కనిపించబోతున్నాడట. ఆగస్టు 18వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్ అతిధి పాత్రలో కనిపించబోతున్నారు అని చెప్పాలి.


 అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బంధం బిజీబిజీగా ఉంది. కాగా మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ సయామీకేర్ ప్రపంచ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను కలిసింది. కాసేపు ఆయనతో సరదాగా ముచ్చటించి క్రికెట్ మెలుకువలను నేర్చుకుంది. ఈ క్రమంలోనే ఇక బౌలింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా బౌలింగ్ చేస్తే రన్స్ రాకుండా చేయవచ్చు అనే విషయాలను కూడా సచిన్ను అడిగింది సయామీకేర్. ఈ సందర్భంగా లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేసే సయామీ ఖేర్ ఆకట్టుకుంది. ఆమె బౌలింగ్ పై సచిన్ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా చేసావ్. నేను ఇప్పటివరకు ఇలాంటి యాక్షన్ ఉన్న బౌలింగ్లో ఆడలేదు అంటూ సచిన్ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: