అందరూ హీరోయిన్లు మితిమీరిన అందాల ఆరబోత చేసి ఆఫర్లు సాధిస్తూ ఉంటే.. ఆఫర్లు లేకపోయినా పరవాలేదు కానీ నాకు నచ్చని పని అస్సలు చేయను అంటూ మొదటినుంచి మొండి పట్టుతోనే ఉంది సాయి పల్లవి. ఇక ఈ మొండిపట్టే అందరిలో ఆమెను ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ఎక్స్పోజింగ్ చేయకపోయినా కోట్ల మంది అభిమానించేలా చేసింది. ఇక ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులను మైమరిచేలా చేసాయి అని చెప్పాలి. ఇక సాయి పల్లవి ఎక్కడ వివాదాలు జోలికి పోకుండా.. ఎక్కడ విమర్శలు ఎదుర్కోకుండా ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోతుంది.
అయితే అలాంటి సాయి పల్లవి గురించి ఇటీవలే బాలీవుడ్ స్టార్ విలన్ మనీషా వద్వా చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. సాయి పల్లవి ముందు ప్యాంట్ విప్పాలంటే భయమేసింది అంటూ చెప్పుకొచ్చాడు మనీషా వద్వా. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాయి పల్లవి, నాని జంటగా శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించి మెప్పించింది సాయి పల్లవి. ఇదే సినిమాలో గురువు పాత్రలో నటించాడు మనిష్ వద్వా. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో సాయి పల్లవిని తీవ్రంగా కొట్టి ఆమెపై మూత్ర విసర్జన చేసే సన్నివేశం ఉంటుంది. అయితే ఆ సీన్ చేయాలంటే చాలా భయపడిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ బాలీవుడ్ విలన్. ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది అంటూ తెలిపాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి