దీనికితోడు జూనియర్ అదేవిధంగా బాలకృష్ణ బయట కనిపించిన సందర్భాలు కూడ చాలా తక్కువ. అదేవిధంగా మోక్షజ్ఞ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కనిపిస్తే చూడాలి అన్న కోరిక కూడ నందమూరి అభిమానులలో ఎప్పటినుంచో ఉంది. ఈమధ్య నందమూరి సోదరులందరూ కూడ ఒకే దగ్గర చేరి మాట్లాడుతున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతేకాకుండా ఆవీడియోలో జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు మోక్షజ్ఞకు ఏదో చెబుతున్నట్లుగా కూడా కనిపించడంతో ఆ వీడియో మరింత వైరల్ అయింది.
ఇది ఇలా ఉండగా నందమూరి కళ్యాణ్ రామ్ మోక్షజ్ఞ ముగ్గురు కలిసి తీయించుకున్న ఫోటో కూడ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ ఫోటోలు చాలవు అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ ఇద్దరు కూడా ఆప్యాయంగా హగ్ చేసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈఫోటోను చూసి నందమూరి అభిమానులు అంతా జోష్ లో ఉన్నారు. అంతేకాదు ఈ ఫోటోను చూసిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సపోర్టు ఉంటుంది అంటూ అప్పుడే ఊహా గానాలు కూడ మొదలుపెట్టేశారు.
మోక్షజ్ఞ ఫిలిమ్ ఎంట్రీ కోసం బాలకృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు అన్నవార్తలు ఎప్పటి నుంచో వస్తున్నప్పసాటికి ఆవార్తల పై ఇప్పటికీ స్పస్టమైన క్లారిటీ లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక రోజున మోక్షజ్ఞ బిగ్ స్క్రీన్ పై రావడం ఖాయం అన్నమాటలు మాత్రమే బాలయ్య దగ్గర నుంచి వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి