ఈమధ్య కాలం లో వచ్చిన రెండు సూపర్ హిట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించగా అవి ఓటీటీలోకి వచ్చే సరికి అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. అందులో ఒకటి జైలర్ కాగా మరొకటి బేబీ సినిమా. సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ తర్వాత అంత గొప్ప టాక్ రాబట్టుకోలేదు.

సినిమాను ఫ్యాన్స్ అంతా థియేటర్ లోనే చూడగా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ చూసిన వారికి ఓటీటీలో సెల్ ఫోన్, టీవీల్లో అది వర్క్ అవుట్ కాలేదు. అనిరుద్ మ్యూజిక్ ఫీల్ కూడా థియేటర్ అరుపులు పెట్టించగా టీవీల్లో పెద్దగా కిక్ ఇవ్వలేదు. అందుకే జైలర్ ఓటీటీ వెర్షన్ ఫ్లాప్ అయ్యింది. ఇక మరోపక్క బేబీ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ లో 90 కోట్ల గ్రాస్ రాబట్టగా ఓటీటీ రిలీజ్ తర్వాత అంతగా ఆకట్టుకోలేదు.

కొందరైతే ఈ సినిమాకు అంత వసూళ్లు ఎలా వచ్చాయని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా థియేట్రికల్ రన్ లో సూపర్ హిట్ అయిన సినిమా ఓటీటీ కి వచ్చేసరికి ఆశించినంత టాక్ తెచ్చుకోవడంలో విఫలమవుతున్నాయి. మరి జైలర్, బెబీలకు జరిగినట్టుగా మిగతా సినిమాలకు ఇదే సీన్ రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. జైలర్, బేబీ ఈ రెండు సినిమాలే కాదు అంతకుముందు కూడా కొన్ని సినిమాలకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎలాగు థియేట్రికల్ రన్ హిట్ కాబట్టి ఓటీటీ రిజల్ట్ గురించి లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.  డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే ఆ రిజల్ట్ మీద సినిమా హిట్టా ఫట్టా అన్నది తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: