స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా అరుదైన ఘనతలను కూడా అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవలే ఉత్తమ నటుడుగా కూడా జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ మొట్టమొదటి టాలీవుడ్ యాక్టర్ గా ఈ అవార్డును అందుకొని పలు సంచలనాలను సృష్టించారు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ మరొక గౌరవాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డుగా పేరు సంపాదించారు. ఇంటర్నేషనల్ లెవల్లో ఎంతో ఫేమస్ పేరు సంపాదించిన అల్లు అర్జున్ కి ఇప్పుడు అరుదైన గౌరవం లభించినట్లుగా తెలుస్తున్నది.

 లండన్ లోని మేడమ్ టుసాస్డ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అక్కడ తమ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ మన తెలుగు హీరోలు ప్రభాస్ ,మహేష్ బాబు మైనపు విగ్రహాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అల్లు అర్జున్ ఈ విగ్రహం కోసం కొలతలు ఇవ్వడానికి లండన్కు వెళ్ళబోతున్నట్లు సమాచారం.


ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ ఘనత సాధించిన మరొక సౌత్ యాక్టర్ గా అల్లు అర్జున్ నిలుస్తాడని చెప్పవచ్చు.. ఇదిలా ఉంటే ఇప్పటికే పుష్ప-2 సినిమా పైన భారీగా అంచనాలను పెంచేశారు సుకుమార్.. నేషనల్ అవార్డు తర్వాత ఈ సినిమా పైన మరింత అంచనాలు కూడా పెరిగిపోయాయి. తాజాగా ఊరు మాక్స్ మీడియా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఒక సర్వేలో తెలియజేయడం జరిగింది. పుష్ప-2 మొదటి స్థానం దక్కించుకోవడంతో ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: