
ప్రేక్షకులకు నచ్చి మెప్పించే కథలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జై భీమ్ అనే ఒక సందేశాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ సృష్టించిన సూర్యా.. ఇక ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు సిద్ధమయ్యాడు. శివ దర్శకత్వంలో తనకు తెరకెక్కుతున్న.. ఈ మూవీ పిరియాడికల్ డ్రామాక రూపొందుతుంది. ఈ సినిమాలో దిశాపటాని హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తయింది అని చెప్పాలి.
ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుండగా మొసలితో సూర్య క్రేజీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి అటు సూర్య ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. మొసలితో ఫైట్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అని ఊహించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పది భాషల్లో రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి.