తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం భారీ యాక్షన్ సినిమా లియోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఖైదీ విక్రమ్ వంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు మార్కెట్లో దీనిపై హై డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే లియో ట్రైలర్ కోసం తమిళ అభిమానుల తో

పాటు టాలీవుడ్ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా లోకేష్ కనకరాజ్ నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియో కు వరుస పోస్టులు పెడుతూనే ఉన్నారు అభిమానులు. అలా ఈ సినిమా ట్రైలర్ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ లియో  ట్రైలర్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అక్టోబర్ 5న ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లుగా కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఈ వార్త విన్న విజయ అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ క్రమంలోనే అనౌన్స్మెంట్తో ఒక పోస్టర్ని విడుదల చేశారు.

తోడేలు తో విజయ్ పోరాడుతున్న దృశ్యాన్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. దాంతో ఈ పోస్ట్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. మొత్తానికి ట్రైలర్ డేట్ ఫిక్స్ అవ్వడంతో అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. చివరిగా విజయ్ దళపతి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఇప్పుడు లియో సినిమాతో వస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత కుమార్ 300 కోట్లకు పైగానే బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ త్రిష 14 ఏళ్ల తర్వాత విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. సంజయ్ దత్ అర్జున్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి వారు చాలామంది కీలకపాత్రలో కనిపించబోతున్నారు. కాగా అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: