ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది ఆమని. సౌత్ లో ఉన్న అందరు స్టార్ హీరోలు సరసన నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలతో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. అయితే ఇటీవల ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమని. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అంటూ ఆమని కామెంట్స్ చేసింది.
కెరియర్ తొలినాళ్లలో సినిమా అవకాశాల కోసం నేను ఫోటోలను పంపితే వారు ఆడిషన్స్ కు రమ్మని పిలిచేవారు. ఆడిషన్స్ కు వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయా.. రంగు తక్కువగా ఉంది అంటూ హేళనగా మాట్లాడేవారు. కొంతమంది ఫోన్ చేసి చెప్తాను అంటూ సైలెంట్ గా ఉండిపోయేవారు. ఇక ఇండస్ట్రీలోకి వెళ్ళాక కొంతమంది డైరెక్టర్లు అవకాశాలు ఇచ్చి బోల్డ్ సన్నివేశాలలో నటించమని చెప్పేవారు ఇలాంటి సన్నివేశాలలో నటించాలంటే బాడీ పై ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ ఉండకూడదని.. అలాంటివి ఏమైనా ఉన్నాయా చూపించు అంటూ ఘోరంగా మాట్లాడేవారు. తనకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే.. అలాంటి సినిమాలు నుంచి తప్పుకున్నాను అంటూ ఆమని చెప్పుకొచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి