పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మంగళవారం' మూవీ ఇటీవల థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆజ్మల్ అమీర్, అజయ్ ఘోష్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, చైతన్య ఇతర కీలక పాత్రలు పోషించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మిస్టీరియస్ థ్రిల్లర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని A క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్  పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. మొదటి సినిమాలోనే తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోసిన పాయల్ 

మంగళవారం మూవీలో ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన నటన కనబరిచింది. దానికి తోడూ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయింది. డైరెక్టర్ అజయ్ భూపతి ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో సినిమా తెరకెక్కించడంతో మంగళవారం మూవీకి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. నవంబర్ 17న ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పై సోషల్ మీడియాలో రోజురోజుకీ ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్స్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. 

మంగళవారం సినిమాలోని ఓ సీన్ క్లిప్ ను షేర్ చేసిన ఆ నెటిజన్ చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు. ముఖ్యంగా పాయల్ లో దుస్తులపై అసభ్యకర కామెంట్ చేయడంతో దీనికి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ రియాక్ట్ అవుతూ..' అది నాది కాదు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇచ్చింది' అంటూ తనదైన శైలిలో ఆ నెటిజన్ కి బుద్ధి చెప్పింది. ఇది చూసిన పలువురు నెటిజన్స్ అతని తీరును వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో పాయల్ రాజ్ డేరింగ్ ని మెచ్చుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం పాయల్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: