వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్  చిత్రంలో నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ మై ఫ్రెండ్, MCA, వకీల్ సాబ్ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో 'ఐకాన్' అనే ప్రాజెక్ట్ ని తెరకెక్కించాలనుకున్న విషయం తెలిసిందే. 'పుష్ప 2' స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాల్సి ఉండగా పలు అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు కాస్త హోల్డ్ లో పడింది.

ఇప్పుడు వేణు శ్రీరామ్ తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేస్తుండడంతో బన్నీతో చేయాల్సిన ఐకాన్ ప్రాజెక్ట్ ని వేణు శ్రీరామ్ నితిన్ తో చేయబోతున్నట్లు ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు హీరో నితిన్. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన అప్ కమింగ్ మూవీ గురించి మాట్లాడుతూ.." ఐకాన్ ఒక డిఫరెంట్ ఫిలిం. మేం చేస్తుంది పూర్తిగా ఫ్రెష్ స్టోరీ. తమ్ముడు అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ అన్నదమ్ముల సెంటిమెంట్ తోనే ఎక్కువగా సాగుతుంది" అంటూ తాజా ఇంటర్వ్యూలో నితిన్ చెప్పుకొచ్చాడు. 

నితిన్ చెప్పిన దాని ప్రకారం వేణు శ్రీరామ్ ఫ్రెష్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో వేణు శ్రీరామ్ 'ఐకాన్' ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తోనే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇదే ఇంటర్వ్యూలో నితిన్ ఈ సినిమా హీరోయిన్ కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాడు. కాంతార మూవీ ఫేమ్ సప్తమి గౌడ ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపికైనట్లు వెల్లడించాడు. మరోవైపు ఈ సినిమాతో పాటు గతంలో తనకి 'భీష్మ' వంటి భారీ విజయాన్ని అందించిన వెంకీ కుడుములతో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్.


మరింత సమాచారం తెలుసుకోండి: