గత కొన్ని నెలలుగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడుతోంది. ఎట్టకేలకు ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు ఈరోజు సాయంత్రం 7:19 నిమిషాల సమయంలో రాబోతున్నది. ఈరోజు కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూశారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సలార్ యుద్ధం చూడడానికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆతృతగా ఎదురుచూస్తోంది.


భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోషల్ మీడియాలో సలార్ సినిమా పేరు షేక్ అవ్వడం మొదలవుతోంది. ఎన్నోసార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తున్నప్పటికీ ఈ సినిమా హైప్ మాత్రం తగ్గలేదు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్ టీజర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్ లేకుండా కూడా ఈ సినిమాని ఎంతో పగడ్బందీగా డైరెక్టర్ ప్రశాంత్  నీల్ తెరకెక్కిస్తున్నారు.


ఎట్టకేలకు ఈరోజు రాత్రి 7:19 నిమిషాలకు సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. దీంతో అభిమానులు ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ సినిమా ట్రైలర్ క్లాస్ మాస్ ఆడియన్స్ సైతం కలిగి ఉంటుందా ఇలాంటి ట్రైలర్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదా అనే హైప్ ని ఆకాశానికి సైతం దాటేస్తోంది. ప్రభాస్ ఎలా కనిపిస్తారు అనేంతగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో మొత్తం ప్రభాస్ హవాని కొనసాగుతోంది. మరి ఎలాంటి రికార్డులను సైతం సలార్ ట్రైలర్ తో సృష్టించడానికి సిద్ధమవుతారో చూడాలి అంటే మరో కొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. ఇవే కాకుండా ప్రభాస్ కల్కి సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: