'మిచౌంగ్‌' తుఫాన్ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో చేరుకోవడంతో డిసెంబర్ 4 సోమవారం రాత్రి చెన్నైలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి చెన్నై విమానాశ్రయంలో భారీగా వరద చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పలు విమానాలను రద్దుచేసి మరికొన్నిటిని దారి మళ్లించారు. చెన్నై విమానాశ్రయంలోని రన్ వే, ఎయిర్ ప్లైన్ పార్కింగ్ జోన్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఈ 'మిచౌంగ్‌' తుఫాన్ డిసెంబర్ 5న నెల్లూరు - మచిలీపట్నం మధ్య దక్షిణాంధ్ర తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది .

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఈ పరిస్థితి పై కోలీవుడ్ అగ్ర హీరో విశాల్    స్పందించారు. ఈ మేరకు విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్  విఫలమైందంటూ విశాల్ ఆరోపించాడు." డియర్ ప్రియా రాజన్ జీసీసీ కమిషనర్, ప్రజా ప్రతినిధులుజ్ సంబంధిత అధికారులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ కుటుంబాలతో మీరు క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వరదల వల్ల వచ్చే నీరు మీ ఇళ్లల్లోకి రాదనుకుంటున్నా. ఇలాంటి సమయంలో మీకు మాత్రం నిరంతర విద్యుత్తు, ఆహారం ఉంటుంది. 

కానీ ఒక ఓటరుగా ఇదే నగరంలో నివసిస్తున్న మేమంతా అలాంటి పరిస్థితుల్లో లేము. 2015లో చెన్నైలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అప్పుడు వాళ్ళందరికీ మేము సహాయం చేసాం. కానీ 8 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు అంతకు మించిన దారుణమైన పరిస్థితి కనిపించడం ఎంతో బాధగా ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో కూడా మేము ఖచ్చితంగా ఆహారం, తాగునీరు, కనీస వసతి కల్పిస్తాము. ఇలాంటి సాయం చేస్తూనే ఉంటాం. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బయటకు రండి. బయటకు వచ్చి అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను" అంటూ  ఓ వీడియోని పోస్ట్ చేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: