సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. అప్పుడు వరకు ఎవ్వరికీ తెలియని అపరిచితులుగా ఉన్న నటీనటులు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ లుగా మారిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి వారి పేరు వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా పుణ్యమా అంటూ ఒక నటి ఏకంగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆమె ఎవరో కాదు తృప్తి.


 ఈ సినిమాలో హీరోగా నటించిన రణబీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. అయితే రష్మిక మందన్నకు మించి ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది త్రిప్తి. ఏకంగా రణబీర్ కపూర్ తో డీప్ రొమాంటిక్ సీన్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపుని సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ కూడా ఆమె గురించి చర్చించుకుంటున్నారు. తన అందం అభినయంతో కుర్ర కారు మతి పోగొట్టిన తృప్తి గురించి ఇక ఎన్నో రకాల వార్తలు  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఇలా ఈ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. యానిమల్ సినిమాలో బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిన తృప్తి ఏకంగా ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెల్లెలు అవుతుంది అంటూ ఒక వార్త ఇంటర్నెట్ను షేక్ చేసుకుని అని చెప్పాలి. తృప్తి గతంలో హిందీలో బుల్బుల్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకు నిర్మాత కర్నేష్ శర్మ. ఈయన స్వయాన విరాట్ భార్య అనుష్క శర్మకు అన్నయ్య. ఆ మూవీ సమయంలో తృప్తికి కర్ణేష్ కి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్కు కర్నేష్ శర్మ బావ అయినప్పుడు.. అతన్ని పెళ్లి చేసుకోబోయే తృప్తి విరాట్ కోహ్లీ చెల్లెలు అవుతుందంటూ కొంతమంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: