టాలీవుడ్ లో హీరోగా పేరు పొందిన శివాజీ ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు ఇటీవలే బిగ్ బాస్-7 లో అడుగుపెట్టి మరింత క్రేజీ సంపాదించుకున్నప్పటికీ తన గేమ్తో హౌస్ లో పెద్దన్నగా మారిపోయారు శివాజీ.. మొన్నటి వరకు కనుమరుగైపోయిన శివాజీ బిగ్బాస్-7 లో మంచి ఫామ్ లోకి రావడం జరిగింది. ఈ రియాలిటీ షో తర్వాత కూడా ఆయన వరుసగా సినిమాలలో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే సినిమాలో నటించబోతున్నారు.


బిగ్ బాస్ -7 లో వచ్చాక ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది గతంలో ఎన్నడు లేని విషయాలను కూడా తెలియజేస్తూ మరింత వైరల్ గా మారుతున్నారు శివాజీ. అయితే గతంలో జర్నలిస్టు జాఫర్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగా హీరోలపై పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ముఖ్యంగా మెగా హీరోలకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటూ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.. ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ మీరు ఏమైనా చిరంజీవి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా ఏంటి అని అడగగా..


ఎందుకు అనుకోకూడదు వారికి ఏమైనా ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా డబ్బులు వాళ్ళకి ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అంటూ శివాజీ ఫైర్ కావడం జరిగింది. అలాగే జాఫర్ శివాజీ గారు మీ లైఫ్ లో బ్రేక్ ఫాస్ట్ ఒక్కొక్క దేశాలలో డిన్నర్ ఒక్కొక్క దేశాలలో ఉండేదటగా అని అడగగా.. అంతేకాకుండా మూడు సంవత్సరాల క్రితం మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని జాఫర్ అడగగా తాను మీరా జాస్మిన్ తో ఒక సినిమా చేస్తున్న సమయంలో యూరప్ కి షూటింగ్ కి వెళ్ళాము అక్కడ మైనస్ డిగ్రీలు చలిని తట్టుకొని బాడీలో వెచ్చదనం కోసం టీలో రం కలుపుకొని తాగే వాళ్ళమంటూ తెలియజేశారు నేనే కాదు అక్కడికి వెళ్లిన వారందరూ కూడా ఈ పని చేయాల్సిందే అంటో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: