ఇన్ని సినిమాలకి థియేటర్స్ అడ్జస్ట్ చేయడం అనేది డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా తలనొప్పి తెప్పించే టాస్క్. ఈ విషయంలో ఎందుకో ‘గిల్డ్’ ఇప్పటివరకు సైలెంట్ గా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు దిల్ రాజు.. ఈ సమస్యని తీర్చేందుకు ముందుకొస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం.. డిసెంబర్ 25 లేదా 26 న సంక్రాంతికి రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన దర్శకనిర్మాతలతో ఓ చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి ఇష్యు సాల్వ్ చేయాలని దిల్ రాజు నిశ్చయించుకున్నారట. సో డిసెంబర్ 26 , 27 నాటికి సంక్రాంతి సినిమాలు విడుదల విషయంలో ఓ క్లారిటీ రావచ్చు. ‘మరి ఎవరి సినిమాలు సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటాయి?’ ‘అసలు ఈ సమస్య ఒక్క మీటింగ్లో తేలుతుందా లేక.. ఇంకో రెండు, మూడు మీటింగ్లు పడతాయా?’ అనేది తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి