ఈ పాత్ర ఎవరో మలయాళం హీరో చేసే బదులు మన తెలుగు లోనే ఎవరైనా మీడియం రేంజ్ హీరో తో చేయిస్తే బాగుండేది కదా అనే అభిప్రాయం ఉండేది. మనకి వచ్చిన ఈ ఆలోచన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి రాకుండా ఎందుకు ఉండి ఉంటుంది, కచ్చితంగా వచ్చింది. ఈ పాత్రని తొలుత ఆయన మ్యాచో స్టార్ గోపీచంద్ తో చేయించాలని అనుకున్నాడట. గోపీచంద్ ప్రభాస్ కి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు గతం లో 'వర్షం' అనే చిత్రం లో నటించారు.ఇందులో ప్రభాస్ హీరో గా నటించగా, గోపీచంద్ విలన్ గా నటించాడు. అప్పుడు ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య స్నేహం ఇప్పటి వరకు కొనసాగింది. ఇది ఇలా ఉండగా ప్రశాంత్ నీల్ అడగగానే గోపీచంద్ చెయ్యడానికి సిద్ధం ఉన్నప్పటికీ ప్రభాస్ ఒప్పుకోలేదట. ఎందుకంటే హీరో గా కొనసాగుతున్నావు, ఇలాంటి సమయం లో ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ లో అన్నీ అలాంటి పాత్రలే వస్తాయి, వద్దు అని ఆపించేసాడట. దీంతో ఆ పాత్ర పృథ్వీ రాజ్ చెయ్యాల్సి వచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి