టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రస్తుత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత కేవలం ఇండియా లో మాత్రమే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. దీంతో ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ వేయి కళ్ళతో ఎదురు చూసే రేంజ్ లో ఇక ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే బాహుబలి సినిమా తర్వాత మాత్రం ఎందుకు ప్రభాస్ కు సరైన హిట్లు మాత్రం దక్కడం లేదు.


 అయితే ఇటీవల ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాతో చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రభాస్ ఒక సాలిడ్ హిట్ దక్కించుకున్నాడు. ఈ మూవీ ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రభాస్ ఒక సరికొత్త రికార్డును సృష్టించాడు. ఏకంగా మూడు సినిమాల్లో 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక తొలి దక్షిణాది హీరోగా నిలిచాడు ప్రభాస్.


 ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ ఇటీవల సూపర్ హిట్ అవగా అటు గతంలో ఆయన నటించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ సాధించాయి. ఏకంగా 500 కోట్ల వసుళ్ల మార్క్ నీ బ్రేక్ చేశాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికీ మార్కెట్లో ఒక రేంజ్ కలిగి ఉన్న ప్రభాస్ సలార్ మూవీతో ఇక తన రేంజ్ ని మరింత పెంచుకున్నాడు అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: