అయితే ఈమె వైద్యురాలు కాగా తాను ఏది చెప్పినా తాను ఏదైమా మంచి చేయాలనుకున్నా తాను చెప్పేదంతా వినాలంటే తాను ఒక స్టార్ కావాలని అనుకుని మాడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిందట. అలాగే తనకు ఏమీ తెలియకపోయినా యూట్యూబ్ లో పలు వీడియోలు, ఇంటర్వ్యూలు చూస్తూ మోడలింగ్ గురించి తెలుసుకున్నట్లు కూడా వెల్లడించింది. అలాగే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి తాను పడ్డ కష్టాన్ని అంతా వివరించింది. తాను మోడల్ గా చేస్తానని చెబితే తండ్రి డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పారట. ఇంత కష్టపడి చదివిస్తే మరేదో చేయడాన్ని తాను ఒప్పుకోలేదని.. దీంతో ఆమె తన సాయంత్రం ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ చేయాలని ఫిక్స్ అయి ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు పడే కష్టం గురించి వివరించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి