అద్భుతమైన నటనతో ఒక్కసారిగా తన ఫాలోయింగ్ పెంచేసుకుంది.. తనే అనుపమ పరమేశ్వరన్. ఈ కేరళ కుట్టికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 'అఆ' తో తెలుగు తెరకు పరిచయమై తొలి చిత్రానికి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత శతామానం భవతి.. ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే ల్లో కనిపించి మెప్పించింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ యూత్ ఫేవరేట్ క్రష్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఈ బ్యూటీ.. రౌడీ బాయ్స్ లో లిప్ లాక్ సీన్స్‌లో నటించి షాకిచ్చింది. ఈ లో అనుపమ యాక్టింగ్ చూసి కుర్రాళ్ల మనసులు చెదిరిపోయాయి. ఇక ఇప్పుడు మరోసారి కేరళ కుట్టి విషయంలో ఎంతోమంది అబ్బాయిలు బాధపడిపోతున్నారు. మొన్నటివరకు ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్.. ఎంతో సింపుల్ గా కనిపిస్తూ నెట్టింట ఫోటోస్ షేర్ చేస్తూ హల్చల్ చేసిన అనుపమ.. ఇప్పుడు అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ వీడియో చూసి కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ అయ్యింది.
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ చిత్రంలో నటిస్తుంది అనుపమ పరమేశ్వరన్. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్ లో నేహాశెట్టి కనిపించగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో అనుపమ నటిస్తుంది. మొదటి నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలలో ఈ మలయాళీ బ్యూటీ కొత్తగా కనిపించింది. ఇక మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో ఊహించని లుక్ లో కనిపించి మైండ్ బ్లాంక్ చేసింది. లిప్ లాక్ కిస్ లు, అందాల ఆరబోతతో.. గ్లామర్ డోస్ పెంచేసింది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ కంటే ఎక్కువగా అందరి చూపు అనుపమ పైనే పడింది. ట్రైలర్ చూసి కేరళ కుట్టి విషయంలో చాలా బాధపడ్డారు ఫ్యాన్స్.ఇక ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది అనుపమ. అందులో గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. తెగ ఫీలవుతున్నారు ఫ్యాన్స్. ఈ బ్యూటీ అభిమానులు బాధతో కామెంట్స్ చేస్తున్నారు. టిల్లుగాడు మొత్తం మార్చేశాడు.. బేబీ కొంచెం పద్దతిగా ఉండు.. 'బ్రేకప్ కంటే ఇది ఎక్కువ బాధిస్తుంది'.. ఇంతగా మారిపోవడం చూస్తుంటే బాధగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అనుపమ డైహార్డ్ ఫ్యాన్స్. మొత్తానికి మలయాళీ బ్యూటీ మాత్రం గ్లామర్ షోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న రిలీజ్ కానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి