సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న రిలీజ్ లాక్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిద్ధు మార్క్ కామెడీ, అనుపమ అందాలు సినిమాకు హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఇక టిల్లు స్క్వేర్ సినిమా బిజినెస్ విషయం లో కూడా టాప్ లేచిపోతుంది.

సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా టిల్లు స్క్వేర్ 35 కోట్ల దాకా బిజినెస్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. టైర్ 2 హీరోల సినిమాల కన్నా ఈ ఫిగర్ ఎక్కువే అని చెప్పొచ్చు. మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకు ఈ బిజినెస్ వస్తుంది. సిద్ధు నటించిన డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో టిల్లు స్క్వేర్ పై భారీ హైప్ ఏర్పడింది.

అందుకు తగినట్టుగానే బిజినెస్ అదరగొట్టేసింది. మరి ఈ బిజినెస్ కి తగినట్టుగానే సినిమా సక్సెస్ అవుతుందా.. 35 కోట్ల బిజినెస్ తో వస్తున్న టిల్లు స్క్వేర్ ఎలా లేదన్నా బీభత్సమైన వసూళ్లు తెచ్చుకుంటేనే సినిమా సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ కూడా స్టార్ లీగ్ లోకి వచ్చే అవకాశం ఉంది. టిల్లు స్క్వేర్ బిజినెస్ గురించి తెలిసిన ఆడియన్స్ షాక్ అవుతున్నారు. మరి బిజినెస్ కి తగినట్టుగా సినిమా రిజల్ట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. మార్చి 29 న దాదాపు సోలో రిలీజ్ అవుతున్న టిల్లు స్క్వేర్ కి మాక్సిమం భారీ రిలీజ్ దక్కుతుందని తెలుస్తుంది. సో సిద్ధుకి ఇదొక అద్భుతమైన అవకాశమని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: