రష్మిక మందన్న.. ఈ పేరు గురించి కొత్తగా సిలీ ప్రేక్షకులకు పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది ఎందుకంటే ఆమె ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా నేషనల్ క్రష్ అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంది రష్మిక మందన్న. అయితే ఇక టాలీవుడ్ లో దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన ఈ అమ్మడు.. ఇక్కడ కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంది.


 అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అక్కడ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన అప్డేట్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూనే ఉంటుంది ఈ హీరోయిన్. కాగా ప్రస్తుతం రష్మిక మందన్న జపాన్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే ఇక జపాన్ పర్యటన గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది రష్మిక మందన్న. ఆమె చేసిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తన చిన్నతనం నుంచి కూడా జపాన్ వెళ్లడం ఒక కల అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఇది సాధ్యమవుతుందని కలలో కూడా అనుకోలేదు యానిమేషన్ ప్రపంచంలో ఇచ్చే అవార్డుల కార్యక్రమంలో పాల్గొనాలని కోరిక అంతిమంగా నిజమైంది. ఇక ఎంతో సంతోషంగా ఉంది అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. జపాన్ లోని ఆహారం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది. కాగా జపాన్లో ఏకంగా రష్మికకు సంబంధించిన యానిమేషన్ క్యారెక్టర్ ఉండటం గమనార్హం. కాగా ప్రస్తుతం పుష్ప2 అనే సినిమాతో బిజీగా ఉంది రష్మిక మందన.

మరింత సమాచారం తెలుసుకోండి: