సూర్యను పెళ్లి చేసుకున్నాక దాదాపు పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఇచ్చిన జ్యోతిక తర్వాత మళ్లీ మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న ఆమె ఇటీవల షైతాన్ మూవీలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల మేర రాబట్టింది. ఈ సినిమా గురించి చెప్తూ ఎమోషనలైంది జ్యోతిక.
అద్భుతమైన ప్రయాణం.'కొన్ని సినిమాలు కేవలం గమ్యస్థానాలకే తీసుకెళ్తాయి. కానీ షైతాన్ అనేది ఒక అందమైన, సంతోషకరమైన, ఎన్నో జ్ఞాపకాలు రంగరించిన అద్భుత ప్రయాణం. ఈ జర్నీలో ఎంతోమంది స్నేహితులు దొరికారు. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసిన దేవ్‌గణ్ ఫిలింస్, పనోరమ స్టూడియోస్, జియో స్టూడియోస్ నిర్మాణ సంస్థలకు కృతజ్ఞతలు. టీమ్ మొత్తానికి అభినందనలు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో షైతాన్ టీమ్‌తో పాటు హీరో సూర్యతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.ఆయన్ను ఆరాధిస్తున్నా
ఇది చూసిన ఓ అభిమాని.. 'జ్యోతిక మేడమ్.. సిల్లును ఒరు కాదల్ సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్‌మెన్‌కు పెద్ద అభిమానిని' అని కామెంట్ చేసింది. దీనికి జ్యోతిక.. 'అలాంటివేమీ కుదరదమ్మా..' అని రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై చూసి అభిమాని ఎగిరి గంతేసింది. 'నేను సూర్యకు ఎంత పెద్ద అభిమానినో మీరసలు ఊహించి ఉండరు. నా పేరులో కూడా అతడి పేరును యాడ్ చేశాను. ఆయనే నా ఫస్ట్ లవ్.. నేను ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ విషయం ఆయనకు చెప్పండి. అయినా మీరు పంచే ప్రేమ ముందు నాదెంతలెండి' అని రాసుకొచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి