కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ హీరో గా పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం అనే మూవీ రూపొందింది. ఈ సినిమా పర్వాలేదు అనే అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి  విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి.

అలాగే ఈ సినిమాలో హీరో గా నటించిన విజయ్ కి ఈ మూవీ కి దర్శకత్వం వహించిన పరుశురామ్ కు ఈ సినిమా ద్వారా సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించిందిఎం ఇలా గీత గోవిందం అద్భుతమైన విజయం సాధించడంతో విజయ్ , పరుశురామ్ కాంబో లో మరో మూవీ వస్తే బాగుంటుంది అని ఎంతో మంది అనుకున్నారు. ఇకపోతే కొంతవ్కాలం క్రితమే వీరి కాంబో లో మరో మూవీ అనౌన్స్ అయ్యింది.

దానితో ఎంతో మంది సినీ ప్రేమికులు చాలా ఆనంద పడ్డారు. ఇకపోతే వీరి కాంబో లో రూపొందిన "ఫ్యామిలీ స్టార్" సినిమా ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ యూనిట్ పూర్తి చేసింది. ఇకపోతే ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఈ మూవీ సూపర్ గా ఉంది. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనే రిపోర్ట్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... గోపి సుందర్మూవీ కి సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ఏ రెంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd