ఎస్ఎస్ రాజమౌళి.. ఈయన అందరిలా ఒక బడా డైరెక్టర్ కాదు. ఏకంగా ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలను ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేసిన ఒక లెజెండరీ డైరెక్టర్. చిన్నవయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఒక గొప్ప మేధావి. కొంతమంది రాజమౌళికి ఉన్న సినిమా పిచ్చి మరొకరికి ఉండదేమో అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే సినిమా విషయంలో రాజమౌళికి ఉండే ఇష్టం ఆ రేంజ్ లో ఉంటుంది. ప్రతి సినిమాని ఎంతో ఇష్టంగా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటాడు రాజమౌళి. అందుకే ఇక రాజమౌళిని అభిమానులు అందరూ ప్రేమగా జక్కన్న అని పిలుచుకుంటూ ఉంటారు.


 ఒకవేళ ఏదైనా సన్నివేశం చిత్రీకరించినప్పుడు తన ఇమాజినేషన్ కు తగ్గట్లుగా రాకపోతే ఎన్నిసార్లు రీ టేకులు తీసుకోవడానికి అయినా సరే జక్కన్న సిద్ధమవుతు ఉంటాడు. అందుకే రాజమౌళితో సినిమా అంటే హీరోలకు చుక్కలు కనిపిస్తాయి అని చెబుతూ ఉంటారు. త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ సమయంలో తారక్ ఈ విషయాన్ని ఎన్నో ఇంటీరియర్లలో కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు తో అడ్వెంచర్ మూవీ ని కూడా చేస్తూ ఉన్నాడు జక్కన్న. ఇలా ప్రతి సినిమాను ఎంతో ఇష్టంగా పకడ్బందీగా  ప్లాన్ చేసే జక్కన్న తన కెరీర్ లో ఒక సినిమాను మాత్రం అసలు ఇష్టం లేకున్న టైంపాస్ గా తెరకెక్కించారట.


 ఆ మూవీ ఏదో కాదు మర్యాద రామన్న. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాజమౌళి నుండి వచ్చే సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉండడం కామన్. అయితే ఇలాంటి హిట్ తర్వాత రాజమౌళి చాలా తక్కువ టైం గ్యాప్ లో ఒక మూవీ చేశాడు. అదే మర్యాద రామన్న  ఇందులో సునీల్ హీరో.  ఇంట్రెస్ట్ లేకుండానే ఈ మూవీ చేశాడట జక్కన్న. అయితే అప్పట్లో కమెడియన్ సునీల్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలెక్షన్స్ పరంగా కూడా భారీగానే లాభాలు తెచ్చి పెట్టింది. అయితే ఈ మూవీ విషయంలో తనను తాను తక్కువగా అంచనా వేసుకున్న జక్కన్న రిజల్ట్ చూసిన తర్వాత బోరున ఏడ్చేశాడట  ఇక ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: