టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో ఒక భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.  మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ లోని మొదటి పాటను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది. ఇక ఎట్టకేలకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మూవీ మేకర్స్ విడుదల చేశారు.

మూవీ లోని "ఫియర్" అంటూ సాగే మొదటి పాటను మే 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ అద్భుతంగా ఉండడంతో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ , ఎన్టీఆర్ కు జోడిగా కనిపించబోతుంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనిరుద్ సంగీతం అందించిన మూవీ కావడంతో ఈ సినిమా ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: