యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు తెరపై తిరుగులేని నటుడు.. ఇంకా చెప్పాలంటే.. ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య.తాత నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. జనాల చేత జైజేలు కొట్టించుకుంటున్నాడు ఈ చిన్న ఎన్టీఆర్.ఒక్కొక్కరు ..ఒక్కొక్కలా ..తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు . ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విష్ చేస్తూ తమ ప్రియమైన వ్యక్తులకు విషెస్ చెబుతూ ఉంటారు.తాజాగా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కు విష్ చేసిన తీరు అభిమానులను షాకింగ్ గా అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త డే సందర్భంగా ఫ్యామిలీ సెలబ్రిటీస్ చాలామంది తారక్ కు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫోటోలను వీడియోలను బాగానే ట్రెండ్ చేస్తున్నారు.కాగా రీసెంట్గా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కి బర్త డే సందర్భంగా స్పెషల్ గా విష్ చేసారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా పోస్ట్చేస్తూ ..'పుట్టినరోజు శుభాకాంక్షలు.. రాబోయే సంవత్సరం కూడా నీకు అంత మంచిగా ఉండాలి అని సంతోషకరమైన రోజులు రావాలి అని కోరుకుంటున్నాను .. యుద్ధభూమిలో నీ కోసం ఎదురుచూస్తున్నాను మిత్రమా.. మీ రోజులు ఆనందంగా శాంతితో ఉండాలి. మనం కలిసే వరకు మాత్రమే ..పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా' అంటూ పోస్ట్ పెట్టారు .చాలా చాలా ప్రేమతో ఫ్రెండ్షిప్ తో పెట్టాడు ఈ పోస్ట్ హృతిక్. అయితే కొందరు జనాలు మాత్రం దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎవడైనా ఈ విధంగా బర్త్డ డే విషెస్ అందిస్తాడా ..? నువ్వు నీ అతి ప్రేమ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . మరి కొందరు మాత్రం తారక్ తో ఫ్రెండ్షిప్ అంటే అలానే ఉంటుంది అని .. అందరూ ఆయనను బాగా క్లోజ్ గా అనుకోని ఆ విధంగా మాట్లాడుతారు అని .. హృతిక్ రోషన్ చెప్పిన విషెస్ ను పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: