ఈనెల 27న విడుదలకాబోతున్న ‘కల్కీ 2898’ మూవీ పై రోజురోజుకీ విపరీతమైన అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ టిక్కెట్లకు వస్తున్న స్పందన ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. ఈసినిమా విడుదలకు ఇంకా 10 రోజులు సమయం ఉన్నప్పటికీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ అప్పుడే రెండు మిలియన్ స్థాయిని దాటిపోయింది అంటున్నారు.
ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 23న జరగబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో కానీ విశాఖలో కానీ జరుగుతుంది అని అంటున్నారు. ఈ ఈవెంట్ నిర్వాహణకు ఈమూవీ నిర్మాతలు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారని లీకులు వస్తున్నాయి. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి కూడ రాబోతున్నాడనీ వార్తలు వస్తున్నాయి.
సుమారు లక్షమంది అభిమానులు పాల్గొనే ఈ కార్యక్రమంతో ‘కల్కి’ మ్యానియా తార స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ టిక్కెట్ల కోసం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా అభిమానులు చాలామంది చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమా అడ్వాన్స్ టిక్కెట్లు బుక్ మై షో యాప్ లో ఈ నెల 20 నుంచి ఓపెన్ అవుతాయని చెపుతున్నారు.
అయితే ఒక్కసారి అడ్వాన్స్ టిక్కెట్లు ఓపెన్ అయితే కేవలం 10 నిముషాలలోనే బుక్ మై షో యాప్ క్రాష్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఈసినిమాకు ‘బాహుబలి 2’ రేంజ్ ని మించి ఓపెనింగ్ కలక్షన్స్ వస్తాయని అంచనా వస్తున్నాయి.  అయితే సైన్స్ ఫిక్షన్ గా తీయబడ్డ ఈమూవీకి తెలుగు రాష్ట్రాలలోని బిసి సెంటర్ల ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ఈమూవీ క్రియేట్ చేయబోయే రికార్డుల పై అందరిలోను ఆశక్తి పెరిగిపోతోంది..


.  


మరింత సమాచారం తెలుసుకోండి: