హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఇమాన్ ఇస్మాయిల్ హీరో హీరోయిన్స్ గా చేస్తున్న ఫౌజి సినిమాకి సంబంధించి పూజ కార్యక్రమాలు ఈ మధ్యనే చాలా గ్రాండ్ గా జరిగాయి.ఇక అక్టోబర్లో ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ మొదలవుతుందని కొంతమంది సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్న ఫౌజి సినిమాకి మొదటి ఛాయిస్ ప్రభాస్ కాదని,మరో హీరో అని తెలుస్తోంది. మరి ఇంతకీ ఫౌజీ సినిమా ని మిస్ చేసుకున్న హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నారు ప్రభాస్.అలా హను రాఘవపూడి, మారుతీ వంటి డైరెక్టర్లకు ఆఫర్స్ ఇచ్చి వారి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. అయితే అలాంటి ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ  సినిమా గు రించే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. అయితే ఫౌజీ సినిమా స్వాతంత్రోద్యమంలో జరిగిన ఒక సైనికుడి కి సంబంధించిన స్టోరీ అని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రభాస్ ఫౌజీ సినిమాకి ముందు నాచురల్ స్టార్ నానిని హనూ రాఘవపూడి అనుకున్నట్టు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో హను రాఘవపూడి నాని కాంబినేషన్లో కృష్ణగాడి వీర ప్రేమ గాధ అనే మూవీ వచ్చింది.అయితే ఈ సినిమా తర్వాత మరో సినిమాని వీరి కాంబో లో తీసుకురావడానికి హను రాఘవపూడి చర్చలు జరిపారట. కానీ అవి సఫలం కాలేదు.ఆ తర్వాత  సీతారామం సినిమాని దుల్కర్ సల్మాన్ తో తెరకెక్కించారు.అయితే ఓ ఇంటర్వ్యూలో నాని గురించి మాట్లాడుతూ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా తర్వాత నానితో ఓ సైనికుడి సినిమా తీయాలి అనుకున్నాను. కానీ అది కుదర్లేదని డైరెక్టర్ హను రాఘవపూడి కూడా చెప్పారు.

అయితే ఆ తర్వాత సీతారామం సినిమా వచ్చినప్పటికీ ఆ స్టోరీ వేరే ఈ స్టోరీ వేరే అని అన్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ తో తీయబోయే ఫౌజీ సినిమా కూడా సైనికుడి నేపథ్యంలోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి నానితో చేయాలనుకున్న మూవీనే హను రాఘవపూడి ప్రభాస్ తో చేస్తున్నారని తెలుస్తోంది. మరి నానితో కుదరని ఫౌజీ సినిమా లో ప్రభాస్ నటిస్తే హిట్టు అవుతుందా లేదా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే నాని కోసం ఎలాంటి కథ ప్రిపేర్ చేసుకున్నారో అదే కథని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండానే హను రాఘవపూడి చాలా సింపుల్ గా తెరకెక్కిస్తున్నారట.మరి హను రాఘవపూడి సీతారామం సినిమాలాగే ఫౌజి సినిమాలో కూడా మ్యాజిక్ చేసి చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: