రాజ్ తరుణ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. గత 50 రోజుల్లో రాజ్ తరుణ్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. లావణ్య రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేయగా రాజ్ తరుణ్ నిజంగానే లావణ్యతో సహజీవనం చేశాడని పోలీసుల విచారణలో సైతం తేలింది.
మరోవైపు మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నాడని లావణ్య ఆరోపణలు చేయడంతో పాటు కొన్ని వీడియోలను సైతం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ లవ్ స్టోరీ ట్రయాంగిల్ లవ్ స్టోరీనో కాదో క్లారిటీ అయితే లేదు. రాజ్ తరుణ్ బంగారం లాంటి భవిష్యత్తు మాత్రం ఈ వివాదాల వల్ల ప్రమాదంలో పడిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.
రాజ్ తరుణ్ కు వరుస ఫ్లాపుల వల్ల రెమ్యునరేషన్ సైతం తగ్గిందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రాజ్ తరుణ్ అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజ్ తరుణ్ పై కేసు విషయంలో లావణ్య వెనక్కు తగ్గకపోతే మాత్రం రాజ్ తరుణ్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. రాజ్ తరుణ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. రీల్ లైఫ్ లో హీరో అయిన రాజ్ తరుణ్ రియల్ లైఫ్ లో విలన్ అయ్యాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.