•వరుస హిట్స్.. ఆ హీరోయిన్ కారణంగా డిజాస్టర్ చెవి చూసిన చిరు
•సీక్వెల్ పై భారీ ఆశలు.. నీళ్లు చల్లిన హీరోయిన్..
•ఆ హీరోయిన్ పై చిరాకుపడ్డ ఆడియన్స్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ ఒకానొక సమయంలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత కాలంలో అడపాదడపా సినిమాలు చేశారు. అయితే ఒకప్పుడు కెరియర్లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసిన ఈయనకు అనూహ్యంగా వరుసగా ఫ్లాప్ లు వచ్చాయి. ఆ తర్వాత హిట్లర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు .దీంతో మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేయడం మొదలుపెట్టిన ఈయన మాస్టర్, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, డాడీ ఇలా వరుస సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.. అదే సమయంలో హిందీలో సంజయ్ దత్ నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాని తెలుగులో రీమేక్ చేసి మరో విజయాన్ని అందుకున్నారు చిరంజీవి.
అయితే ఈ సినిమా తర్వాత స్టాలిన్ సినిమా చేసి డిజాస్టర్ ను అందుకున్న ఈయన.. మళ్లీ శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా సీక్వెల్ శంకర్ దాదా జిందాబాద్ గా వచ్చి అది హిందీలో సక్సెస్ సాధించగా.. ఆ సీక్వెల్ మూవీ ని కూడా చిరంజీవి తెలుగులో రీమేక్ చేశారు. మొదటి భాగానికి జయంత్ సీ పరాంజి దర్శకత్వం వహించగా.. సీక్వెల్ కి మాత్రం ప్రభుదేవా దర్శకత్వం చేశారు. ఇక్కడ కామెడీ ప్రేక్షకులను మెప్పించింది కానీ మొత్తంగా శంకర్ దాదా జిందాబాద్ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే మొదటి భాగంలో సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ హీరోయిన్ గా నటించిన సోనాలి బింద్రే అని చెప్పాలి. కానీ సీక్వెల్ లో మాత్రం కరిష్మా కొటక్ అనే అమ్మాయి నటించింది. ఈమె పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ముఖ్యంగా చిరంజీవి ఏజ్ కి తగ్గట్టుగానే అమ్మాయిని తీసుకున్నప్పటికీ, మరీ సగం వయసైపోయిన ముదురు అమ్మాయిలా కనిపించింది. పోస్టర్స్ చూస్తే అభిమానులలో విపరీతమైన హైప్ పెరిగింది. కానీ సినిమా చూసిన తర్వాత చిరాకు పడ్డారు. అసలు ఎవరు ఈ అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేసింది అంటూ జనాలు కూడా తిట్టుకున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం చాలా వరకు హీరోయిన్ అని చాలామంది కామెంట్లు కూడా చేశారు. మొత్తానికి అయితే ఈమె వల్ల వరుస విజయాలు అందుకున్న చిరంజీవి ఈ సినిమాతో బొక్క బోర్ల పడ్డారని చెప్పవచ్చు.