
ఎన్టీఆర్ - బన్నీ - మహేష్ లాంటి హీరోలను పక్కన పెడితే చివరకు ప్రభాస్ లాంటి హీరోలు చేసిన కొన్ని సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అవటం లేదు. మహేష్ గుంటూరు కారం సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. 80 % - 90 % రికవరీ మాత్రమే పెద్ద సినిమాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ లో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు చూసి ఎందుకు ప్రేక్షకులు అస్సలు థియేటర్లలోకి రావటం లేదు. ఇప్పటికే ముగ్గురు వందల గురించి చిన్న మిడిల్ రేంజ్ హీరోలు ఖాళీగా కూర్చున్నారు. కనీసం మరో నలుగురు ఐదుగురు ఖాళీగా కూర్చునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. రవితేజ - గోపీచంద్ - సాయిధరమ్ తేజ్ - కళ్యాణ్ రామ్ - నితిన్ లాంటి హీరోలు హిట్లు కొట్టి చాలా రోజులు అవుతుంది. అసలు వీళ్ళతో సినిమాలు చేసేందుకు కూడా ఏ సంస్థ ముందుకు రాని పరిస్థితి కూడా వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే తప్ప దియేటర్లకు వచ్చే సినిమా చూసి ఎందుకు ప్రేక్షకులు ఎవరు ఇష్టపడటం లేదు. అందుకే ఈ హీరోలతో సినిమా అనేది ఇప్పుడు పెద్ద జూదంగా మారిపోయింది.