ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఒక రెండు సినిమా రిలీజ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఆ రెండు హిట్ సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తెగ పోటీ పడుతున్నాయి. మరి ఆ సినిమాలు  ఏంటో.. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో పోటీ పడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఇటీవల గ్రాండ్ గా విడుదలైన మ్యాడ్ స్క్వేర్ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యంగ్ హీరోస్ నార్నే నితిన్, సంగీత్ శోభన్. రామ్ నితిన్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. గతేడాదిలో కళ్యాణ్ శంకర్ మ్యాడ్ మూవీని తెరకెక్కించి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో దానికి సీక్వెల్ గా ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ సినిమాని తెరకెక్కించి ప్రేక్షకులను మరోసారి మెప్పించారు. ఈ చిత్రం యువతను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను కూడా రాబట్టింది. ఈ మూవీకి సితార ఎంటర్టైన్మెంట్ అలాగే ఫార్చూన్ ఫోర్ మూవీస్ నిర్మాణం వహించారు.


అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇక సమ్మర్ స్పెషల్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమా నేటి నుండి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది.  ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి వీక్షించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: