ఫ్యామిలీ హీరో గానే కాదు రొమాంటిక్ హీరోగా కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు . కెరియర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను సొంతం చేసుకోగా ఇప్పుడు మాత్రం సరైన సక్సెస్ లేక అల్లాడిపోతున్నాడు. శర్వానంద్ వరుస ప్లాప్స్ అందుకుంటున్న సరే ఆయన మార్కెట్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు . కాగా రీసెంట్గా శర్వానంద్ తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశారు . సంపత్ నంది డైరెక్షన్లో శర్వానంద్ ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్గా చూస్ చేసుకున్నారు .
రీసెంట్ గానే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల అని అనుకున్నారట. కానీ శ్రీలీల - శర్వానంద్ కి హిట్స్ లేవు అంటూ శర్వానంద్ సినిమాని చీప్ చేసి మాట్లాడి రిజెక్ట్ చేసిందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . శ్రీ లీల రిజెక్ట్ చేసిన పాత్రను అనుపమ పరమేశ్వరన్ ఓకే చేసిందట . ఆల్రెడీ వీళ్ళ కాంబోలో వచ్చిన "శతమానం భవతి " సూపర్ డూపర్ హిట్ అయింది . మళ్ళీ వీళ్ళ కాంబో సెట్ అవుతుంది అని తెలియగానే ఫ్యాన్స్ ఆ సినిమానే గుర్తు చేసుకుంటున్నారు. ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది వేచి చూడాలి. అయితే శర్వానంద్ లాంటి సాఫ్ట్ హీరోని శ్రీ లీల ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది పెద్ద రాద్ధంతంగా మారిపోయింది. శ్రీ లీలాకి బాలీవుడ్ ఆఫర్స్ రావడంతో హెడ్ వెయిట్ పెరిగిపోయింది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి