బాలీవుడ్ బ్యూటీగా, ఫైర్ బ్రాండ్ గా పేరు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో పుట్టి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీనే శాసించే స్థాయికి ఎదిగింది. అంతేకాదు ఇప్పుడు బిజెపి ఎంపీగా కూడా వ్యవహరిస్తున్న ఈమె చివరిగా ఎమర్జెన్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని, ఎన్నో కలలు కంది. కానీ అనూహ్యంగా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈమెకు హాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం. బ్లెస్డ్ బై ది ఈవిల్ అనే సినిమాలో ఈమెకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక హార్రర్ డ్రామా అని , ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.


ఇక ఈ సినిమాలో స్కార్లెట్ రోస్, టైలర్ పోసీ వంటి వారు నటిస్తున్నారు. వారితో కలిసి ఈమె నటించబోతోంది. ఇక ఈ సినిమాని లయన్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నట్లు సమాచారం. అన్ని ఓకే అయితే ఈ ఏడాదిలోనే న్యూయార్క్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా మెయిన్ సన్నివేశాలు అమెరికాలో జరగబోతున్నట్లు సమాచారం.  ఇకపోతే ఈ సినిమాకి గతంలో టైలింగ్ పాండ్, న్యూ మీ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అనురాగ్ రుద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


అలాగే సినిమాకి కొంతమంది టాప్ టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నట్లు సమాచారం.  నిజానికి ఎంపీ అయిన తర్వాత కంగనా  ఎటువంటి ప్రాజెక్ట్లో భాగం కాలేదు.  కానీ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాలో భాగమైనట్లు చెబుతున్నారు దీన్నిబట్టి చూస్తే కంగనా రనౌత్ రేంజ్ పెరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే కంగనా పేరు హాలీవుడ్ రేంజ్ లో మారు మ్రోగడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: