
అయితే పెళ్లికి ముందు తను హీరోయిన్ అని జగత్ దేశాయ్ కి తెలియదని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత తను హీరోయిన్ అని జగత్ కి చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యారని తెలిపింది. ప్రెగ్నెన్సీ సమయంలో తన సినిమాలు.. అలాగే అవార్డు వీడియోలు చూసి జగత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడని అమలాపాల్ చెప్పుకొచ్చింది. ఇకపోతే అమలాపాల్ కేరళకు చెందిన బ్యూటీ. ఈ అందాల భామ తెలుగుతో పాటుగా మలయాళం, తమిళం సినిమాలలో కూడా నటించింది.
అమలాపాల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో నటించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ ని అందుకుంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో జెండాపై కపిరాజు, నాగచైతన్యతో బెజవాడ సినిమాలలో నటించింది. అమలాపాల్ మొదట డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండేళ్ల తర్వాత ఈ భామ విజయ్ తో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత చాలా కాలం ఒంటరిగా ఉండి ఈ మధ్యకాలంలోనే బిజినెస్ మ్యాన్ జగత్ దేశాయ్ ని రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక మగ బిడ్డ పుట్టాడు.